భారత జాతిపిత మహాత్మా గాంధీ, దివంతగ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి
సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్
జగన్మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం
ఉదయం నిర్వహించిన ఆ మహామహుల జయంతి వేడుకల సందర్భంగా గాంధీజీ, శాస్త్రి
చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించారు.
శ్రీ
జగన్మోహన్‌రెడ్డి రాకతో పార్టీ కేంద్ర కార్యాలయం అభిమానులు, పార్టీ
కార్యకర్తలతో కిక్కిరిసింది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు పెద్ద ఎత్తున
జనం తరలి వచ్చారు. గాంధీజీ, శాస్త్రి జయంతి వేడుకలలో పార్టీ నాయకులు డి.ఎ.
సోమయాజులు, కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్, వై.వి. సుబ్బారెడ్డి,
పి.ఎన్.వి. ప్రసాద్, బి. జనక్‌ప్రసాద్, శివకుమార్, సజ్జల రామకృష్ణారెడ్డి,
వాసిరెడ్డి పద్మ, పి.విజయారెడ్డి, జంపన ప్రతాప్, వివిధ జిల్లాల నుంచి
విశేష సంఖ్యలో వచ్చిన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనతరం
అభిమానులందరికీ శ్రీ జగన్ చిరునవ్వుతో అభివాదం చేశారు.
No comments:
Post a Comment