రాష్ట్ర శాసనసభను తక్షణమే సమావేశపరచాలని గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్‌ను
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి
విజ్ఞప్తి చేశారు. ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సమైక్యాంధ్రకు అనుకూలంగా
తీర్మానం పెట్టాలని కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు శ్రీ జగన్ సోమవారంనాడు
వినతి పత్రాన్ని అందజేశారు.
శ్రీ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం సోమవారం మధ్యాహ్నం గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలుసుకున్నది. రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్ రాక ముందే అసెంబ్లీలో సమైక్యాంధ్ర తీర్మానాన్ని ఆమోదించి, ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించేలా చూడాలని తమ విజ్ఞాపనలో శ్రీ జగన్ కోరారు. శ్రీ జగన్‌తో పాటు పార్టీ ప్రతినిధుల బృందం తనను ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు కలుసుకునేందుకు గవర్నర్ సమయం కేటాయించిన విషయం తెలిసిందే. శ్రీ జగన్ వినతికి సానుకూలంగా స్పందించిన గవర్నర్ ఆ విజ్ఞాపనను ప్రభుత్వానికి పంపిస్తానని హామీ ఇచ్చారు.

No comments:
Post a Comment